మెదక్‌ పర్యటనలో సీఎం కేసీఆర్‌..

203
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా ఇవాళ తూప్రాన్‌లో 50 పడకల ప్రభుత్వాసుపత్రిని ప్రారంభించారు. అనంతరం ఆస్పత్రిలోని వార్డులను సీఎం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు లక్ష్మారెడ్డి , జోగురామన్న, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితోపాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంతకుముందు సీఎం కేసీఆర్ హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో 102, 108 ప్రాజెక్టు రెక్కలు కింద వాహన సేవలను లాంచనంగా ప్రారంభించారు.

CM KCR Inaugurates 50-Bed Hospital In Toopran

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తూప్రాన్‌లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనుల కోసం రూ.5 కోట్లు మంజూరు చేస్తామన్నారు. రూ.20 లక్షలతో షాదీఖానా ఏర్పాటు చేస్తమని పేర్కొన్నారు. తూప్రాన్‌లో పెద్ద చెరువును సుందరీకరిస్తాం. త్వరలో 500 డబుల్‌బెడ్‌రూం ఇండ్లు మంజూరు చేస్తమని సీఎం చెప్పారు. తూప్రాన్‌కు డిగ్రీ కాలేజీ, వైకుంఠధామం మంజూరు చేస్తామని సీఎం ప్రకటించారు.

పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ తూప్రాన్ నుంచి గజ్వేల్ పట్టణానికి చేరుకొని అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. ఆడిటోరియం, సమీకృత కార్యాలయ భవన సముదాయం, వంద పడకల దవాఖాన, వెజ్-నాన్‌వెజ్ మార్కెట్, వంద పడకల దవాఖా, ఎమ్మెల్యే కార్యాలయ భవనం, ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణాల పనులను సీఎం పరిశీలిస్తారు.

- Advertisement -