ఇవాళ కలెక్టర్లతో సీఎం కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్‌

235
cm kcr
- Advertisement -

ఇవాళ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు, వైద్యారోగ్య, మార్కెటింగ్‌, పౌరసరఫరాల అధికారులు పాల్గొననున్నారు. అత్యవసర సరుకుల అందుబాటు, వరి, మొక్కజొన్న సేకరణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు.

మరోవైపు కరోనా మహమ్మారి విస్తరించకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటివరకు 65 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా శనివారం కొత్తగా 6 కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఇక కరోనాపై జరుగుతున్న విష ప్రచారాన్ని నమ్మవద్దని ప్రభుత్వం ప్రతిరోజు బులిటెన్,అప్ డేట్ ఇస్తుందని చెప్పారు మంత్రి ఈటల రాజేందర్.

- Advertisement -