సీసీసీకి విరాళాల వెల్లువ..

164
chaitu

సినీ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీ(సీసీసీ)కి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. సినీ,దర్శక,నిర్మాతలు పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. తాజాగా సిసిసికి యువసామ్రాట్ నాగచైతన్య రూ. 25 లక్షల విరాళం ప్రకటించారు.

అలాగా హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి సైతం లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలకు 70 లక్షలు విరాళంగా ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌…సీసీసీకి సైతం రూ. 30 లక్షలు విరాళం ఇచ్చి తన ఉదారతను చాటుకున్నారు.

ఇక సీసీసీకి ఇప్పటి వరకు రూ. 3.8 కోట్లు వచ్చినట్లుగా మెగాస్టార్ చిరంజీవి తన ట్వీట్‌లో తెలిపారు. సీసీసీకి విరాళం ఇస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.ఈ ఛారిటికి చిరంజీవి ఛైర్మన్‌గా ఉండగా తమ్మారెడ్డి భరద్వాజ,ఎన్ శంకర్,సురేష్ బాబు లాంటి వాళ్లు సభ్యులుగా ఉన్నారు.