డ్రగ్స్‌ కట్టడిపై సీఎం కేసీఆర్ ఉన్నతస్ధాయి సమావేశం

74
kcr
- Advertisement -

పోలీస్‌, ఎక్సైజ్‌ శాఖ అధికారులతో ఇవాళ సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి హాజరుకానున్న హోం మంత్రి మహమూద్‌ అలీ, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, మాదకద్రవ్యాల ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ అధికారులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కట్టడికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. సమగ్ర నివేదికలతో సమావేశానికి రావాలని ఎక్సైజ్‌ అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేయడంతో జిల్లాల్లో పరిస్థితులు, తీసుకుంటున్న చర్యల గురించి వివరించనున్నారు అధికారులు. డ్రగ్స్‌ కట్టడి కార్యాచరణపై అధికారులకు సీఎం దిశా నిర్ధేశం చేయనున్నారు.

- Advertisement -