బిగ్ బాస్ 5…ఎపిసోడ్ 45 హైలైట్స్

122
bb5
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా 45 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఈ వారం నామినేషన్‌లో 8 మంది ఉండగా సన్నీ- ప్రియా మధ్య మరోసారి వాగ్వాదంతో హౌస్‌లో హీట్ పెరిగిపోయింది.

సన్నీ నామినేషన్స్ విషయంలో చేసింది కరెక్ట్ కాదని అతనితో వాదనకు దిగాడు మానస్. కాజల్ గేమ్ స్ట్రాటజీని బయటపెట్టింది ప్రియాంక. ప్రియ ప్లాన్ ప్రకారమే నిన్ను నామినేట్ చేసింది.. టార్గెట్ నువ్వు కాదు.. నేను.. ఆమె నిర్ణయాన్ని మార్చుకోమని నువ్ ఎందుకు చెప్పలేదు.. నిన్నే ఎందుకు నామినేట్ చేసిందో అర్థమైందా? అని రవితో అన్నాడు సన్నీ.

తర్వాత మానస్ తనని అర్ధం చేసుకోలేదని ప్రియాంక ఏడుస్తూండగా ఆమెను ఓదార్చింది. ఇంతలో మాసన్ వచ్చి ఆమెను కూల్ చేసి అన్నం తినిపించడంతో చల్లబడింది ప్రియాంక. తర్వాత కాజల్- రవి మధ్య కాసేపు వేడి వేడిగా డిస్కషన్ నడిచింది. అయితే ప్రియ మాత్రం సన్నీని గిచ్చడం మానలేదు. మానస్ దగ్గరకు వెళ్లి సన్నీకి సపోర్ట్ చేయొద్దని కోరింది. అయితే మానస్ ఆమె గూబ గయ్ అనిపించే సమాధానం ఇచ్చాడు.. మీరు నామినేషన్స్‌లో సిల్లీ రీజన్ చెప్పారు.. సన్నీ ప్లేస్‌లో మీరు ఉంటే ఏం చేస్తారు..? అని అడిగారు. నాకు కాజల్‌ అంటే ఇష్టం ఉండదు.. అందుకే రవిని చేయాల్సి వచ్చిందని చెప్పింది ప్రియ.

తర్వాత ప్రభావతి అనే కోడిపెట్ట సమయానుకూలంగా గుడ్లు పెడుతుందని ఎక్కువ గుడ్లు ఎవరు సంపాదిస్తే వాళ్లే కెప్టెన్సీ పోటీదారులు అవుతారని టాస్క్ ఇచ్చారు. వ్యక్తిగతంగా ఎవరి ఆట వాళ్లు ఆడాలని బిగ్ బాస్ చెప్పినా గ్రూపులుగా ఇంటి సభ్యులు ఆడారు. అయితే సన్నీ సంపాదించిన గుడ్లను దొంగలించి సిల్లీగా ప్రవర్తించింది ప్రియా. నేను అందరి గుడ్లను దొంగతనం చేస్తా.. ఎవరు ఏం చేస్తారో చేసుకోండి హ హ అంటూ కాస్త అత్యుత్సాహం చూపించింది.

సన్నీ బుట్టలో ఉన్న గుడ్లను ప్రియా దొంగలించడంతో సన్నీకి కోపం వచ్చింది. నా జోలికి వస్తే బాగోదని ముందే చెప్పా? అని అనడంతో.. బరాబర్ తీసుకుంటా.. అదే నా గేమ్.. దోచుకో పంచుకో.. ఎవడికీ బయపడేది లేదు అంటూ సన్నీ సహనానికి పరీక్ష పెట్టింది. అంతేగాదు సన్నీని మానస్‌ని వేరు చేయడానికి తనకి ఇచ్చిన గుడ్లను మానస్‌కి ఇచ్చి నువ్ కెప్టెన్ పోటీదారుడు కావాలని చెప్పింది ప్రియ.

అయితే ఫస్ట్ రౌండ్‌లో అందరికంటే ఎక్కువ మానస్ దగ్గర 32, సన్నీ దగ్గర 23 గుడ్లు ఉండటంతో తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ప్రియాంకతో పాటు ప్రియ కూడా మానస్‌కి గుడ్లు త్యాగం చేసింది. సిరి స్టిక్కర్లు ఎవరో నొక్కేయడంతో అందరి బెడ్‌లను చెక్ చేసింది. షణ్ముఖ్, జెస్సీ బెడ్‌లను చెక్ చేయడంతో షణ్ముఖ్ హర్ట్ అయ్యాడు. అయితే నేను వాళ్ల బెడ్‌లు చెక్ చేయలేదు అని ఏడుపు మొదలుపెట్టింది సిరి. ఇక ఇవాళ్టి ఎపిసోడ్‌లో కూడా ప్రియా – సన్నీ మధ్య వార్ కొనసాగడంతో మరింత రచ్చగా మారనుంది గేమ్.

- Advertisement -