అభివృద్ధిలో మహిళలది అత్యంత కీలక పాత్ర అని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళాలోకానికి సీఎం శుభాకాంక్షలు తెలిపారు. పురుషునితో నేడు అన్ని రంగాల్లో పోటీపడుతూ మహిళ తన ప్రతిభను చాటుకుంటున్నదన్నారు. జనాభాలో సగంగా వున్న మహిళలకు అవకాశాలు ఇస్తే అద్భుతాలు చేసి చూయిస్తారని సీఎం తెలిపారు. వారిని అభివృద్ధి పథంలో నడిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నదని సీఎం అన్నారు.
మహిళల భద్రతకు షీ టీమ్స్, వృద్ధ, ఒంటరి మహిళలు, వితంతువులకు పింఛన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, అంగన్ వాడీ, ఆశా వర్కర్లకు వేతనాల పెంపు సహా మహిళా సాధికారత కేంద్రంగా చేసుకుని ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రం మహిళా సంక్షేమంలో ముందంజలో ఉన్నదన్నారు సీఎం కేసీఆర్.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చ్ 8, 2021న రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ మహిళా ఉద్యోగులందరికీ సెలవు దినంగా ప్రకటించినట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ సందర్భంగా తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్కు సీఎం ఆదేశాలు ఇచ్చారు.