రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు: సీఎం కేసీఆర్

22

తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2022లో కూడా కష్టాలను అధిగమిస్తూ, అదే అకుంఠిత దీక్షతో సుపరిపాలన కొనసాగిస్తామని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామని ఉద్ఘాటించారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే లక్ష్యమని పేర్కొన్నారు. కొత్త సంవత్సరంలో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.