హుజుర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా శానంపూడి సైదిరెడ్డి పోటిచేయనున్నట్లు ప్రకటించారు పార్టీ అధినేత సీఎం కేసీఆర్. ఈమేరకు సోమవారం సాయంత్రం ప్రగతి భవన్ లో సైదిరెడ్డికి భీ ఫారమ్ అందజేశారు సీఎం. మరో సారి తనకు అవకాశం ఇచ్చినందుకు సీఎం కు ధన్యవాదాలు తెలిపారు సైదిరెడ్డి. ఈసారి తప్పకుండా హుజుర్ నగర్ గడ్డపై గులాబీ జెండా ఎగురవేస్తామని చెప్పారు.
ఇక హుజుర్ నగర్ ఉప ఎన్నిక షెడ్యూల్ ను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ను విడుదల చేశారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రంజిత్ కుమార్. ఈ మేరకు ఉప ఎన్నిక జరిగే స్థానం హుజర్ నగర్ స్థానానికి ఈ నెల 30వ తేదీ వరకు నామినేషన్ దాఖలు చేయడానికి గడువు ఉంది. వచ్చేనెల1వ తేదీ నామినేషన్‌ల పరిశీలిస్తారు. అక్టోబర్ 3వ తేదీ నామినేషన్‌ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఐతే ఉప ఎన్నిక పోలింగ్ అక్టోబర్ 21న నిర్వహిస్తుండగా, 24వ తేదీ ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.