సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలి.. యాదాద్రిలో ఎర్రబెల్లి పూజలు..

38
Minister Errabelli

రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసే సీఎం కేసీఆర్, పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్‌లతో పాటు రాష్ట్రంలోని కరోనా భారిన‌ప‌డ్డ ప్ర‌జ‌లు కూడా త్వరగా కోలుకొవాల‌ని కోరుకుంటూ శుక్ర‌వారం యాదాద్రి శ్రీ ల‌క్ష్మీన‌ర‌సింహాస్వామి దేవ‌స్థానంలో రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా శాఖామంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.

అంద‌రూ ఆయురారోగ్యంగా ఉండాలని, కరోనా పీడ త్వరగా వదిలి పోవాలని, తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని శ్రీ‌ లక్ష్మీన‌ర‌సింహుడిని వేడుకున్నట్లు మంత్రి ఎర్ర‌బెల్లి తెలిపారు. మంత్రి వెంట TSIIC చైర్మ‌న్‌, టిఆర్ఎస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గ్యాద‌రి బాల‌మ‌ల్లు, హైద్రాబాద్ మాజీ మేయ‌ర్ బొంతు రాంమోహ‌న్ ఉన్నారు.