టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న బెంగళూరు..

40
PBKS vs RCB

నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఐపీఎల్‌ 14 2021 సీజన్‌లో భాగంగా ఈరోజు పంజాబ్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తలపడుతున్నాయి. ముందుగా టాస్‌ గెలిచిన బెంగళూరు సారథి కోహ్లీ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు ఐదింట్లో గెలుపొంది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.

మరోవైపు ఆరు మ్యాచ్‌లాడిన పంజాబ్ కేవలం రెండింట్లో మాత్రమే విజయం సాధించి ఆరో స్థానంలో కొనసాగుతోంది. సీజన్‌లో ఇరుజట్లు తలపడటం ఇదే మొదటిసారి. బెంగళూరు మరో విజయం సాధించి జైత్రయాత్రను కొనసాగించాలని చూస్తోంది. తడబడుతున్న పంజాబ్‌ మళ్లీ గెలుపుబాట పట్టాలని పట్టుదలతో ఉంది.

ఐపీఎల్‌లో బెంగళూరు, పంజాబ్ తలపడిన రికార్డుల్ని ఓసారి పరిశీలిస్తే.. ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 26 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో 14 మ్యాచ్‌ల్లో పంజాబ్ గెలుపొందగా.. 12 మ్యాచ్‌ల్లో బెంగళూరు విజయం సాధించింది.

తుది జట్లు :

Punjab Kings (Playing XI): KL Rahul(w/c), Chris Gayle, Deepak Hooda, Nicholas Pooran, Prabhsimran Singh, Shahrukh Khan, Chris Jordan, Riley Meredith, Ravi Bishnoi, Mohammed Shami, Harpreet Brar

Royal Challengers Bangalore (Playing XI): Virat Kohli(c), Devdutt Padikkal, Rajat Patidar, Glenn Maxwell, AB de Villiers(w), Shahbaz Ahmed, Daniel Sams, Kyle Jamieson, Harshal Patel, Mohammed Siraj, Yuzvendra Chahal