హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన టీ హబ్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తైంది. అయితే ఈ ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ఈ నెల 28న ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ఐటీ శాక మంత్రి కేటీఆర్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఆదివారం ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ పోస్ట్ చేశారు.. టీహబ్ నిర్మాణాలకు సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేశారు.
కేటీఆర్ ట్వీట్.. టీ హబ్ హైదరాబాద్ ప్రారంభంతో తెలంగాణలో ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్‌కు పునరుజ్జీవం రానుందని, ఈ రంగంలో మరిన్ని ఉపాధి అవకాశాలు రానున్నాయని కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ చెప్పిన ఓ సూక్తిని కేటీఆర్ ప్రస్తావించారు. భవిష్యత్తు ఊహకు దానిని సృష్టించుకోవడమే ఉత్తమమైన మార్గమన్న లింకన్ మాటలను కేటీఆర్ ట్వట్టర్ ద్వారా పేర్కొన్నారు.