సీఎం కేసీఆర్‌ గజ్వేల్ టూర్‌ హైలెట్స్..

543
- Advertisement -

హైదరాబాద్ శివారు ములుగులోని ఫారెస్ట్ కాళేజ్ & రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్సిఆర్ఐ)ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఈటెల రాజేందర్, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ గుప్త తదితరులు ముఖ్యమంత్రి వెంట వున్నారు. ఇంకా పిసిసిఎఫ్ ఆర్ శోభ, ఎఫ్సిఆర్ఐ డీన్ చంద్ర శేఖర్ రెడ్డి, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది, కాలేజ్ స్టాఫ్, విద్యార్థులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

kcr in Gajwel

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గజ్వేల్ పర్యటన హైలెట్స్ ఇవే..

– ముందుగా కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ కాంప్లెక్స్ ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు.
– కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆవిష్కరించారు.
– ములుగులో సెంటర్ ఆఫ్ ఎక్సిలెన్స్ (ఫ్రూట్స్)ను ముఖ్యమంత్రి సందర్శించారు.
– సీఎం కేసీఆర్‌ పైలాన్‌ను ఆవిష్కరించి, మొక్క నాటారు.. అలాగే అటవీ కళాశాల విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

kcr cm– సీఎం, మంత్రులు కాలేజీ క్యాంపస్‌ను పరిశీలించారు.
– గజ్వేల్‌లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాంప్లెక్స్,ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు.
– గజ్వేల్ ప్రజ్ఞాపూర్‌లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు ముఖ్యమంత్రి శంఖుస్థాపన చేశారు.
– గజ్వేల్‌లో వందపడకల హాస్పిటల్‌కు ముఖ్యమంత్రి శంఖుస్థాపన చేశారు.
– గజ్వేల్‌లో మహితి ఆడిటోరియంను ప్రారంభించారు ముఖ్యమంత్రి కేసీఆర్‌.

kcr in Gajwel

Chief Minister K Chandrasekhar Rao touring in his constituency Gajwel on Today..Chief Minister K Chandrasekhar Rao touring in his constituency Gajwel..

- Advertisement -