వాసాలమర్రికి సీఎం కేసీఆర్…దళితవాడలో పర్యటన

43
kcr

సీఎం కేసీఆర్ ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు రోడ్డు మార్గంలో వాసాలమర్రికి చేరుకోనున్నారు సీఎం. సీఎం పర్యటన సందర్భంగా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు అధికారులు.

పల్లెబాట కార్యక్రమంలో తొలుత సీఎం దళితవాడలో పర్యటించి, తర్వాత గ్రామమంతా కలియ తిరుగుతూ పారిశుద్ధ్య చర్యలను పరిశీలిస్తారు. ప్రజలతో మాట్లాడిన అనంతరం సర్పంచి పోగుల ఆంజనేయులు నివాసంలో భోజనం చేయనున్నారు. అనంతరం రైతు వేదిక భవనంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడనున్నారు.

అనంతరం గ్రామాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు.. గ్రామస్తులు కోరుకుంటున్నది ఏంటి? అనే దానిపై చర్చ సాగనుంది.. కాగా, ఇప్పటికే అధికారులు పూర్తిస్థాయిలో వివరాలు సేకరించారు.. ఏం చేస్తే బాగుంటుంది అనేదానిపై కసర్తు కూడా చేసినట్టుగా సమాచారం.