మహబూబ్ నగర్ కు సీఎం కేసీఆర్..

132
CM KCR
- Advertisement -

సీఎం కేసీఆర్ ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. పాలకొండలో నిర్మించిన నూతన కలెక్టరేట్ కార్యాలయంతో పాటు అంబేద్కర్ చౌరస్తాలో నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.

రోడ్డు మార్గంలో భారీ కాన్వాయ్ తో ఆయన మహబూబ్ నగర్ కు చేరుకోనున్నారు. అనంతరం అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం ఎంవీఎస్డి డిగ్రీ కాలేజీ గ్రౌండ్ లో జరుగనున్న భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. భారీ సంఖ్యలో ప్రజలు ఈ సభకు హాజరుకానున్నారు. సీఎం సభ నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -