ఇవాళ సీఎం కేసీఆర్ మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. మెదక్‌లో ప్రగతి నివేదన సభ ద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టడంతో పాటు దివ్యాంగులకు పెంచిన రూ.4016 పింఛన్ పంపిణీని ప్రారంభించనున్నారు. అలాగే దేశంలో తొలిసారిగా బీడీ టేకేదారులకు పింఛన్ అందించే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు సీఎం.
బీడీ టేకేదారులు, ప్యాకర్లకు రూ.2,016 చొప్పున ఆసరా పింఛన్ పంపిణీ కార్యక్రమాన్నీ ప్రారంభించనున్నారు. అలాగే మెదక్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్, జిల్లా పోలీస్ ఆఫీస్, బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.
ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి గుమ్మడిదల, నర్సాపూర్, కౌడిపల్లి మీదుగా మధ్యాహ్నం ఒంటిగంటకు మెదక్ చేరుకోనున్నారు. తొలుత ఆయన బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1.20 గంటలకు జిల్లా పోలీసు కార్యాలయాన్ని, మధ్యాహ్నం 1.40 గంటలకు సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మెదక్ సీఎస్‌ఐ చర్చి గ్రౌండ్‌లో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు.
Also Read:చంద్రయాన్ -3..తెలంగాణ కీలక నిర్ణయం