- Advertisement -
సీఎం కేసీఆర్ ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్న సీఎం…జాతీయ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించడంలో భాగంగా వివిధ పార్టీల నేతలను కలిసె అవకాశం ఉంది.
22న చండీఘడ్ లో పర్యటించి రైతు ఉద్యమంలో మరణించిన 600 మంది బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు. అనంతరం ఢిల్లీ, పంజాబ్ సీఎంలతో కలిసి రైతు ఉద్యమంలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించనున్నారు.
ఈనెల 26న మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామిని కలవనున్న సీఎం.. ఈనెల 27న బెంగళూరు రానున్న అన్నా హజారేతో సమావేశం కానున్నట్లు తెలుస్తుంది. మొత్తంగా సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.
- Advertisement -