ఢిల్లీకి సీఎం కేసీఆర్

66
- Advertisement -

సీఎం కేసీఆర్ మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇందుకోసం సోమవారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.
సీఎం వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఎంపీలు సంతోష్‌కుమార్‌, జీ రంజిత్‌రెడ్డి, ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్‌కుమార్‌రెడ్డి, కరీంనగర్‌ మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌ తదితరులు ఉన్నారు.

రాష్ట్రపతి ఎన్నికలు ముగిసి, పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న తరుణంలో సీఎం హస్తిన పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రంలో సంభవించిన వరదలపై ఇప్పటికే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. వరదల కారణంగా సుమారు రూ. 1,400 కోట్ల మేర నష్టం జరిగినట్లు నివేదికలో పేర్కొంది. దీంతో సీఎం కేసీఆర్.. ప్రధాని మోదీ లేదా కేంద్ర మంత్రులను కలిసి వరద సాయాన్ని కోరే అవకాశాలున్నాయి.

అలాగే విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్‌ అళ్వాకు మద్దతు కోసం విపక్షాలు దిల్లీలో నిర్వహించే సమావేశానికి సీఎం కేసీఆర్‌ను ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్‌ ఆహ్వానించినట్లు సమాచారం.

- Advertisement -