హ్యాట్సాఫ్ సీఎం సర్…విజయవాడలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీ..!

87
cm
- Advertisement -

ఏపీలోని రాజకీయ నగరంగా పేరున్న బెజవాడ నడిబొడ్డున తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిలువెత్తు ఫ్లెక్సీ.. ఏర్పాటైంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమా విడుదలను పురస్కరించుకుని టికెట్ల ధరలు ఇతర అంశాలపై తెలంగాణ ప్రభుత్వ తీరును మెచ్చుకుంటూ.. విజయవాడలో కృష్ణలంకకు చెందిన పవన్ ల్యాణ్ అభిమానులు ‘హ్యాట్సాఫ్ సీఎం సార్’ అంటూ కేసీఆర్ కేటీఆర్ ఫోటోలతో ఉన్న భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది. ఫ్లెక్సీపై మరోవైపు వంగవీటి రంగా మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ ఫోటోలు ఉండడం గమనార్హం.. కాగా మరోవైపు ఏపీ ప్రభుత్వ తీరుపై పవన్ ఫ్యాన్స్ భగ్గుమన్నారు.

పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాకు బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వని జగన్ సర్కార్…టికెట్ల రేట్లు పెంచితే థియేటర్లను సీజ్ చేస్తామని ఎగ్జిబిటర్లకు వార్నింగ్ ఇచ్చింది. అంతే కాదు భీమ్లానాయక్ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద ఎమ్మార్వోలు, కలెక్టర్లు తనిఖీలు నిర్వహించడం గమనార్హం. కాగా తమ అభిమాన హీరో నటించిన భీమ్లానాయక్ చిత్రాన్ని థియేటర్లలో ప్రదర్శించకుండా ప్రభుత్వం అడ్డంకులు సృష్టించిందని పవన్ ఫ్యాన్స్ , జనసేన శ్రేణులు ఆందోళనలకు దిగారు. సీఎంకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలుచోట్ల నిరసనలు చేపట్టారు.మంత్రులు కొడాలి నాని పేర్ని నానికి కృష్ణా జిల్లా గుడివాడలో పవన్ అభిమానుల నిరసనల సెగ తగిలింది. ప్రస్తుత టికెట్ ధరలు గిట్టుబాటు కావని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హీరోగా నటించిన భీమ్లానాయక్ చిత్రాన్ని ప్రదర్శించాల్సిన రాష్ట్రంలోని 15 థియేటర్లను వాటి యాజమాన్యాలు మూసేశాయి.మరో అయిదు థియేటర్లలో ఈ చిత్రానికి బదులుగా వేరే సినిమాలు ప్రదర్శించారు. ఇంకో ఏడు థియేటర్ల లో మధ్యాహ్నం సాయంత్రం తర్వాత భీమ్లానాయక్ చిత్రాన్ని వేశారు.

టికెట్ ధరలు పెంచకుండా థియేటర్లపై అధికారులు నిఘా పెట్టారు. విశాఖలో భీమ్లానాయక్ పోస్టర్స్ పై తహసీల్దార్ ఫోన్ నంబర్లు రాయించారు. అభిమానుల కోసం ప్రత్యేక ప్రదర్శనలు అనుమతించలేదు. కాగా తెలంగాణలో భీమ్లానాయక్‌ మూవీకి బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడమే కాకుండా అదనంగా ఐదవ షోకు ఛాన్స్ ఇచ్చింది. అంతే కాదు 15 రోజుల పాటు టికెట్ల ధరలు పెంచుకునే అవకాశం ఇచ్చింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. విజయవాడలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం.. సంచలనంగా మారింది. కాగా ఏపీలో బీజేపీతో జనసేన పార్టీ పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. కాని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణలో మంత్రి కేటీఆర్‌ను తన సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్‌కు గెస్ట్‌గా ఆహ్వానించారు. ఆ సందర్భంలో టీఆర్ఎస్ నేతలు, కేసీఆర్ సర్కార్‌పై పవన్ ప్రశంసలు కురిపించడం తెలంగాణ బీజేపీ నేతలకు షాకింగ్‌గా మారింది. ఇప్పుడు ఏకంగా జనసేన శ్రేణులు తమ రాజకీయ ప్రత్యర్థి సీఎం కేసీఆర్‌ను పొగుడుతూ విజయవాడలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం బండి బ్యాచ్‌కు షాకింగ్‌గా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరుపై బండి సంజయ్ హైకమాండ్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మొత్తంగా సీఎం కేసీఆర్‌‌‌‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సహా ఆ పార్టీ శ్రేణులు ప్రశంసలు కురిపించడం బండి బ్యాచ్‌కు షాకింగ్‌గా మారిందనే చెప్పాలి.

- Advertisement -