మోదీని తరిమితరిమి కొట్టాలె.. సీఎం కేసీఆర్‌ ఫైర్..

51
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. అనంతరం రాయగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కేంద్రంపై నిప్పులు చెరిగారు. మోదీ సర్కారుకు పిచ్చి ముదురుతోందని అన్నారు. పిచ్చి పిచ్చి పాలసీలు తెచ్చి ప్రజలపై రుద్దుతున్నారని ధ్వజమెత్తారు.

వ్యవసాయ వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చి ఏడాదిపాటు రైతులను ఏడిపించారని పేర్కొన్నారు. ఢిల్లీ వద్ద అన్నదాతలను అవమానించారని, గుర్రాలతో తొక్కించారని విమర్శించారు. ఆఖరికి ఉత్తరప్రదేశ్ లో రైతులపై కార్లను కూడా ఎక్కించారని ఆగ్రహం వెలిబుచ్చారు. ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికలు రావడంతో ఆ వ్యవసాయ బిల్లులు వెనక్కి తీసుకున్నారని, ప్రధాని స్వయంగా క్షమాపణ కోరారని సీఎం కేసీఆర్ విమర్శించారు.

మోడీ ప్రభుత్వానికి మెంటల్ అయిపోయి పిచ్చి ఎక్కి రైతులతో గెలుక్కుంటున్నారు మోడీని తరిమి తరిమి కొట్టాలన్నారు కేసీఆర్. 8 ఏళ్ల బీజేపీ పాలనలో దేశాన్ని సర్వనాశనం చేసింది. నరేంద్ర మోడీ సిగ్గుపడాలి.. ఏంది చూసేది తోకమట్టనా? కేసీఆర్ సంగతి చూస్తా అంటే బయపడడు.. ఈ దేశం ఎవని అయ్యా సొత్తు కాదు అని మండిపడ్డారు. హిజాబ్ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. మతపిచ్చి లేపి కర్ణాటకలో ఆడపడుచులను ఆగం చేస్తున్నారు. బిజెపి వాళ్ళు కుక్కల లెక్క అరవడం మానాలి. పొద్దున లేస్తే కర్ఫ్యూలు- ఘర్షణలు అవసమా? అని సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -