కేంద్రంపై సీఎం కేసీఆర్‌ ఫైర్‌..

132
kcr
- Advertisement -

శనివారం సాయంత్రం సీఎం కేసీఆర్‌ తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. యాసంగిలో ధాన్యం కొనుగోలుపై కేంద్రంతో తేల్చుకుంటామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వరి ధాన్యం కొనుగోలు మీద జరుగుతున్న వ్యవహారంలో ఎన్నిసార్లు నిరంతరంగా డిమాండ్‌ చేసినా కేంద్రం నుంచి ఎటువంటి సమాధానం కూడా వస్తలేదు. మీం కోరింది అన్ని రాష్ట్రాల నుంచి ధాన్యం సేకరించినట్లే తెలంగాణ నుంచి సేకరిస్తరు కాబట్టి.. సంవత్సరం టార్గెట్‌ ఇవ్వండి.. దాన్ని బట్టి రాష్ట్రంలో సర్దుబాటు చేయాల్సి ఉంటుందని.. అందువల్ల చేయమని రెక్వెస్ట్‌ చేసినం. ఎందుకోమరి సరైన పద్ధతుల్లో రావడం లేదు. మొన్న ధర్నా చేసిన రోజున రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతాం. మాట్లాడుతం అన్నరు. చివరి ప్రయత్నంగా రేపు ఢిల్లీకి వెళ్తున్నం అని సీఎం తెలపారు.

మంత్రుల డెలిగేషన్‌, పార్లమెంట్‌ సభ్యులు డెలిగేషన్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఫైనాన్స్‌ సెక్రెటరీ, అగ్రికల్చర్‌ సెక్రెటరీ, సివిల్‌ సప్లయ్‌ సెక్రెటరీ అధికారులు డెలిగేషన్‌ కలిసి మంత్రిని, అధికారులను అవసరమైన పక్షంలో ప్రధానిని కలిసి డిమాండ్‌ చేద్దాం అనుకుంటున్నం. ఎందుకంటే అనురాధ నిన్న ప్రారంభమైంది. రైతులు ఏదో ఒకటి తేల్చకపోతే కన్ఫ్యూజన్‌లో ఉంటరు. అనవసరమైన ఇబ్బందులు చాలా వచ్చే అవకాశం ఉంటది. రైతులు తమకు ముందే చెబితే వేరే పంట వేసుకుందుం కదా.. యాళ్లకు నష్టపోయినం అనే మాట వస్తది. మొన్న గాలివార్త వచ్చింది.. రాష్ట్ర ప్రభుత్వంతో ధాన్యం కొనుగోలు మీద మాట్లాడుతామని, బాయిల్డ్‌ రైస్‌ కొనమని చెప్పినట్లు వార్త వచ్చింది. మరి అధికారికమా? కాదా? అడిగి తేల్చుకునేందుకు ఢిల్లీకి వెళ్తున్నం. బహుశా రెండు రోజులు పట్టొచ్చు. దాని దరిమిలా తెలంగాణ రైతాంగానికి ఏందనేది విషయాన్ని తెలుపుతామని సీఎం కేసీఆర్‌ అన్నారు.

- Advertisement -