సంక్రాంతికి సందడి చేయనున్న బంగార్రాజు..!

122
- Advertisement -

నాగార్జున, రమ్యకృష్ణ కలసి సోగ్గాడే చిన్నినాయన సినిమాతో చేసిన మ్యాజిక్ అందరికీ తెలిసిందే. మరోసారి బంగార్రాజు పాత్రలో రమ్యకృష్ణతో కలిసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు నాగార్జున రెడీ అవుతున్నారు. సోగ్గాడే చిన్ని నాయనతో అందరినీ మెప్పించిన కళ్యాణ్ కృష్ణ ఈ ప్రీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు. నాగ చైతన్య, కృతి శెట్టిలు మరో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై. లి., జీ స్టూడియోస్ బ్యానర్లపై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. సత్యానంద్ స్క్రీన్ ప్లేను అందిస్తుండగా.. సినిమాటోగ్రఫర్‌గా యువరాజ్ పని చేస్తున్నారు. ఈ సినిమా, ప్రస్తుతం షూటింగు దశలో ఉంది.

అయితే ఈ నెల 22వ తేదీన ‘బంగార్రాజు’ పోస్టర్ ను వదలనున్నట్టు ప్రకటించారు. అలాగే టీజర్ ను 23వ తేదీ ఉదయం రిలీజ్ చేయనున్నట్టు చెప్పారు. ఈ ఊపు ఉత్సాహం చూస్తుంటే, నాగార్జున తన సినిమాను సంక్రాంతికి దింపడం ఖాయమనే అనుకుంటున్నారు. “సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చినా చూస్తారు .. ఆ పండుగకి ఉన్న ప్రత్యేకత అదే” అని గతంలో ఒకసారి నాగ్ చెప్పిన సంగతి తెలిసిందే.

- Advertisement -