CMKCR:మాది Aటీమ్, Bటీమ్ కాదు … రైతుల టీమ్‌

18
- Advertisement -

తెలంగాణలో సాధ్యమైన అభివృద్ధి మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదని సీఎం కేసీఆర్ అన్నారు. షోలాపూర్ పర్యటనలో భాగంగా పండరీపురంలోని శ్రీవిఠలుడి దర్శనాంతరం ఏర్పాటు చేసిన సర్కోలీ సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. సర్కోలి సభకు విచ్చేసిన తనకు అపూర్వ స్వాగతం పలికిన భగీరథ్ బాల్కేకు ధన్యవాదాలు తెలిపారు. దేశం బాగు కోసం ప్రస్తుతం మరో స్వాతంత్య్ర పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. దేశంలో సమూలమైన మార్పులు తీసుకురావాలని అన్నారు.

దేశంలో వనరులు పుష్కలంగా ఉన్నాయని, ఇన్ని వనరులున్న దేశంలో విద్యుత్‌ సమస్య ఎందుకు వచ్చిందని..? కేసీఆర్‌ ప్రశ్నించారు. దేశంలోని చిన్న గ్రామాల నుంచి పెద్ద నగరాల వరకు విద్యుత్‌ అందించే సామర్థ్యం మనకు ఉందని కేసీఆర్‌ చెప్పారు. కేంద్ర సర్కార్ల చేతగాని తనమే దేశంలో విద్యుత్‌ సమస్యలకు కారణమని మండిపడ్డారు. ఇకనైనా భారతదేశం సరికొత్త పంథాలో నడవాల్సిన అవసరం ఉందన్నారు. మనకంటే చిన్న దేశాలు ఎంతో అభివృద్ధి సాధించాయని చెప్పారు. తెలంగాణలో తాము ఎన్నో అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చామని తెలిపారు.

Also Read: CMKCR:శ్రీవిఠలుడికి ప్రత్యేక పూజలు..

రత్నగర్భ అయిన మహారాష్ట్రకు ఏం తక్కువైందని కేసీఆర్‌ ప్రశ్నించారు. తెలంగాణ తరహా అభివృద్ధి మహారాష్ట్రలో ఎందుకు జరగడంలేదని ఆయన ప్రశ్నించారు. తాము ఏ పార్టీకి A టీమ్‌, B టీమ్‌ కాదని, తమది రైతుల టీమ్‌.. ప్రజల టీమ్‌ అని కేసీఆర్‌ నొక్కి చెప్పారు. ప్రభుత్వాలు అనుకుంటే పుష్కలంగా తాగునీరు అందించవచ్చని చెప్పారు. ప్రస్తుతం భారతదేశం అనుసరిస్తున్న జల విధానాన్ని బంగాళాఖాతంలో కలుపాలని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. దేశానికి నూతన జలవిధానం అవసరమని అభిప్రాయపడ్డారు.

Also Read: Tomato:సెంచరీ కొట్టిన టమోట..

- Advertisement -