రామ్ రావు మహారాజ్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం..

123
kcr

బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ. తపస్వి. పౌరా దేవి పీఠాధిపతి రామ్ రావు మహారాజ్ శివైక్యం చెందడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. రామ్ రావ్ మహారాజ్ బంజారాల జీవితాల్లో మార్పు కోసం ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టారని సీఎం కొనియాడారు. యావత్ భారతదేశంలోని బంజారాలను చైతన్య పరిచి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని కెసిఆర్ ప్రశంసించారు. రామ్ రావ్ మహారాజ్ స్ఫూర్తిని తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలోని బంజారాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.