- Advertisement -
రాష్ట్ర గిరిజన శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తండ్రి లింగ్యా నాయక్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. మంత్రి సత్యవతిని సీఎం కేసీఆర్ ఫోన్లో పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లింగ్యా నాయక్ మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండాలోని తన నివాసంలో ఈరోజు తెల్లవారుజామున మృతిచెందారు.
- Advertisement -