ఆందోల్ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున సభ ఇదివరకెప్పుడూ జరగలేదన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఆందోల్ నియోజకవర్గంలో పర్యటించారు కేసీఆర్. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..మొట్టమొదటిసారిగా ఈ గడ్డ బిడ్డ ఇక్కడ ఎమ్మెల్యే కాబోతున్నాడని స్పష్టం చేశారు. మి ముందున్న కాంత్రి మంచి తెలివి ఉన్నోడు.. జర్నలిస్టుగా పనిచేసిన క్రాంతిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
క్రాంతి గెలిస్తేనే ఆందోల్ అభివృద్ది చెందుతుందన్నారు. ప్రజల మధ్యలో ఉండేవాళ్లకు ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మాకు బాసులు ఢిల్లీలో లేరు..రాష్ట్ర ప్రజలే మాకు బాసులు అన్నారు. తెలంగాణలో ఇంత అభివృద్ది జరుగుతుందని కళగన్నామా అని ప్రజలను ప్రశ్నించారు. దేశంలో రైతులకు 24గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.
ఒంటరి మహిళలకు పెన్షన్లు, రైతుబంధు, రైతుభీమా పథకాలతో దేశంలోనే ముందంజలో ఉన్నామన్నారు. పాత మెదక్ జిల్లాలో సంగారెడ్డి, నారాయణ్‌ఖేడ్, జహీరాబాద్, ఆందోల్ నియోజకవర్గాలకు ఇప్పుడు వచ్చే 40 వేల ఎకరాలకు అదనంగా 60 ఎకరాలకు..మొత్తం లక్ష ఎకరాలకు సాగునీరు రావాలన్నారు. మీ బిడ్డ క్రాంతిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్.