త‌మిళ ద‌ర్శ‌కుడితో అఖిల్..

189
akhil mitran

అక్కినేని అఖిల్ ప్ర‌స్తుతం తొలి ప్రేమ ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో మిస్ట‌ర్ మ‌జ్ను సినిమాలో న‌టిస్తున్నాడు. అఖిల్ త‌న కెరీర్ లో న‌టిస్తున్న మూడ‌వ సినిమా ఇది. రొమాంటిక్ ల‌వ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈమూవీ జ‌న‌వ‌రిలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇటివ‌లే విడుదైల‌న ఈసినిమాకు సంబంధించిన టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. దీంతో ఈమూవీపై అంచ‌నాలు పెరిగిపోయాయి.

maznu

ఈమూవీ త‌ర్వాత అఖిల్ ఏద‌ర్శ‌కుడితో చేయ‌నున్నాడ‌ని ఆయ‌న అభిమానులు అతుర‌త‌గా ఎదురుచూస్తున్నారు. తాజాగా వ‌స్తున్న స‌మాచారం ప్ర‌కారం అఖిల్ త‌న త‌ర్వాతి సినిమా త‌మిళ్ డైరెక్ట‌ర్ తో చేయ‌నున్నాడ‌ని తెలుస్తుంది. రీసెంట్ గా విడుద‌లై భారీ విజ‌యాన్ని సొంతం చేసుకున్న అభిమ‌న్యుడు సినిమా ద‌ర్శ‌కుడు మిత్రన్ తో సినిమా చేయ‌నున్నాడ‌ని స‌మాచారం.

abhimanyudu

రీసెంట్ గా ఆయన అఖిల్ ను కలిసి ఒక లైన్ చెప్పాడట. చాలా వైవిధ్యభరితంగా అనిపించడంతో పూర్తి కథను సిద్ధం చేయమని అఖిల్ అన్నాడట. క‌థ సిద్దంచేసిన వెంట‌నే ఈసినిమాను ప‌ట్టాలెక్కించ‌నున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.