సీనియర్ సంపాదకుడు, సామాజిక ఉద్యమకారుడు రాఘవా చారి మరణం పట్ల ముఖ్యమంత్రి కేసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిబద్ధత కలిగిన జర్నలిస్ట్ గా, విలువలు కలిగిన సామాజిక కార్యకర్త గా ఆయన సాగించిన జీవితం ఆదర్శ ప్రాయం అన్నారు. కుటుంబ సభ్యులు, సహచరులకు సానుభూతి తెలిపారు.
సీనియర్ జర్నలిస్ట్ రాఘవచారి మృతి పట్ల రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గొప్ప మార్క్సిస్టు నాయకులు రాఘవచారి మృతి తీరని లోటు అన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాఘవచారిని ఐదు రోజుల కిందట పరామర్శించినట్లు వినోద్ కుమార్ తెలిపారు.
వరంగల్ జిల్లాకు చెందిన రాఘవచారి చివరి క్షణం వరకు నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి ఉన్నారని చెప్పారు. రాఘవచారి కుటుంబ సభ్యులకు వినోద్ కుమార్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
రాఘవా చారి మరణం పట్ల వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. నిబద్ధత, విలువలు కలిగిన జర్నలిస్ట్ గా ఆయన సాగించిన జీవితం ఆదర్శ ప్రాయం అని అన్నారు . ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
రాఘవాచారి గారి మృతి పట్ల పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. పాలకుర్తి ప్రాంతానికి చెందిన రాఘవాచారి జీవితాంతం నిబద్దత, విలువలకు కట్టుబడిన గొప్ప వ్యక్తి అని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. రాఘవాచారి కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు.