మంచు విష్ణుకి సర్‌ప్రైజ్ ఇచ్చిన మెగాస్టార్

519
manchu manoj
- Advertisement -

దీపావళి సందర్భంగా హీరో మంచు మనోజ్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. శంషాబాద్‌లోని మంచు విష్ణు ఇంట్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరైన చిరంజీవి సందడి చేశారు. ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీకి చెందిన పలువురు హాజరుకాగా చిరుతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు విష్ణు.

మనందరికీ ఇష్టమైన మెగాస్టార్ చిరంజీవి అంకుల్‌కు నా కుమార్తె ఐరా విద్యను పరిచయం చేశాను అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అనంతరం విష్ణు దంపతులతో సరదాగా ముచ్చటించారు.

ఇటీవలె సైరాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు చిరు. ఇక ఈ మూవీ తర్వాత ప్రస్తుతం చిరంజీవి తన 152వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నారు. నవంబర్‌లో సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

- Advertisement -