కోడెల మృతి…సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్బ్రాంతి

582
cm kcr kodela
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు.

డాక్టర్ కోడెలగా గుంటూరు జిల్లా వాసులకు సుపరిచితం. 1983లో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన వరుసగా ఐదు సార్లు నరసరావు పేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత రెండు సార్లు ఓడిపోయినా 2014లో సత్తెనపల్లి నుంచి విజయం సాధించారు. నవ్యాంధ్ర తొలి స్పీకర్‌గా పనిచేశారు.

ఏపీ హోం మంత్రిగా,పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు కోడెల. నరసరావుపేటలో ఆసుపత్రిని ప్రారంభించారు. ఆయన హస్తవాసి గొప్పదని ఇక్కడి వారు చెప్పుకుంటుంటారు. కోడెల మరణ వార్త తెలుసుకున్న ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.

- Advertisement -