మాజీ ఎమ్మెల్యే గుర్రం యాదగిరిరెడ్డి మృతి..సీఎం కేసీఆర్ సంతాపం

593
cm kcr
- Advertisement -

 

సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గుర్రం యాదగిరి రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రామన్నపేట నియోజకవర్గం నుంచి సీపీఐ తరపున 1985 నుంచి 1994 వరకు వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన యాదగిరిరెడ్డి నిరాడంబరుడనీ, చివరివరకూ ఆ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారని గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

మరోవైపు ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్, ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.రామకిష్టయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం తెలిపారు. ప్రొఫెసర్ రామకిష్టయ్య తెలంగాణ గర్వించే వ్యక్తి అనీ, తుదిశ్వాస వరకు సామాజిక సేవలందించారని గుర్తు చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

Cm Kcr Condolence To Former Mla gurram yadagiriReddy..

- Advertisement -