ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు హైకోర్టులో ఊరట

394
mla chennamaneni ramesh
- Advertisement -

టీఆర్ఎస్ సీనియర్ నేత, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన పౌరసత్వాన్ని రద్దు చేసినట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.ఆయన భారత పౌరసత్వానికి అనర్హుడని కేంద్ర హోంశాఖ స్పష్టం చేస్తూ అధికారిక ప్రకటన జారీ చేయడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

దీనిపై ఈ రోజు విచారణ చేపట్టిన హైకోర్టు… కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను నాలుగు వారాల పాటు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణను డిసెంబరు 16కి వాయిదా వేసింది.తన పౌరసత్వాన్ని రద్దుచేస్తూ బుధవారం కేంద్ర హోంశాఖ జారీచేసిన ఉత్తర్వులు ఏకపక్షం, రాజ్యాంగ విరుద్ధమని, సిటిజన్‌షిప్ యాక్ట్-1955 సెక్షన్ 10 (3) నిబంధనలను కేంద్ర హోంశాఖ ఉల్లంఘించిందని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.

- Advertisement -