పోచారం శ్రీనివాస్‌రెడ్డి తల్లి పాపవ్వ(107) మంగళవారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. పోచారం తల్లి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. శ్రీనివాస్ రెడ్డి మాతృవియోగం సమాచారం తెలుసుకున్న కేసీఆర్.. ఆయనకు ఫోన్ చేసి పరామర్శించారు. ఆమె అంత్యక్రియలు బుదవారం జరిగాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ గురువారం బాన్సువాడ మండలం పోచారం గ్రామానికి వెళ్లనున్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని సీఎం కేసీఆర్ పరామర్శించనున్నారు.
సీఎం కేసీఆర్ పోచారం వెళ్లి స్వర్గీయ పాపవ్వ చిత్రపటానికి నివాళులర్పించి.. శ్రీనివాస్‌రెడ్డిని పరామర్శించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా సీఎం కేసీఆర్ బాన్సువాడకు చేరుకుంటారు. రెండు రోజుల క్రితమే తీవ్ర అస్వస్థతకు గురైన పరిగె పాపవ్వకు బాన్సువాడ ఏరియా దవాఖానలో చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడకు చేరుకొని తల్లి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. అత్యవసర చికిత్స అందిస్తున్న సమయంలో మంగళవారం ఆమె తుదిశ్వాస విడిచారు.