ఉపాధ్యాయుడిగా మారిన సీఎం కేసీఆర్‌..!

426
- Advertisement -

రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, కార్యదర్శులకు శిక్షణ ఇచ్చే రిసోర్స్‌పర్సన్స్‌తో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. ప్రతి పంచాయతీ తన పరిధిలోని వనరులు, అవసరాలను అంచనా వేసుకుంటూ.. ఐదేండ్ల ప్రణాళిక తయారుచేసుకోవాలని, అందుకు అనుగుణంగా పనులు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. గ్రామం ఇప్పుడు ఎక్కడుంది? ఐదేండ్ల తర్వాత ఎక్కడికి పోవాలి? ఐదేండ్లలో ఎన్ని నిధులు వస్తాయి? వాటితో ఎలాంటి పనులు చేయాలి? అనే విషయాలను నిర్ధారించుకుని రంగంలోకి దిగాలని సీఎం కేసీఆర్‌ సూచించారు.

CM KCR

 

గ్రీన్ విలేజ్- క్లీన్ విలేజ్ నినాదంతో గ్రామంలో పచ్చదనం పెంచడానికి, పారిశుద్ధ్య పరిరక్షణకు, శ్మశానవాటికల నిర్మాణానికి, పన్నుల వసూలుకు మొదటి దఫాలో ప్రాధాన్యం ఇస్తూ ప్రణాళిక తయారుకావాలని చెప్పారు. ప్రణాళిక తయారీలో సర్పంచ్‌లు, కార్యదర్శులకు రిసోర్సుపర్సన్లు తగిన సలహాలు, సూచనలు, ఇవ్వాలని కోరారు. సర్పంచ్‌లు, గ్రామకార్యదర్శులకు అన్ని విషయాలపై అవగాహన కల్పించాలని, గ్రామ వికాసానికి పాటుపడేలా వారిలో స్ఫూర్తిని, చైతన్యాన్ని కగిలించాలని సీఎం చెప్పారు.

ఈ సమావేశంలో రిసోర్స్‌పర్సన్లకు శిక్షణ ఇచ్చే సందర్భంగా సీఎం కేసీఆర్ ఉపాధ్యాయుడి మరిపోయాడు. ప్రతి విషయంపై పూర్తిస్థాయి అవగాహన కల్పించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయిన సమావేశంలో మధ్యాహ్నం రెండుగంటల వరకు నిల్చునే మాట్లాడారు. భోజన విరామం తర్వాత 3 నుంచి 5 గంటల వరకు మళ్లీ నిల్చున్నారు. పంచాయతీరాజ్ కొత్త చట్టం, పంచాయతీల బాధ్యతలు- విధులు, నిధులు సమకూరే మార్గాలు, ఖర్చుపెట్టే పద్ధతులు, ప్రజాప్రతినిధులకు నైతిక నియమాలు, రిసోర్స్ పర్సన్ల బాధ్యతలపై సుదీర్ఘంగా మాట్లాడారు.

- Advertisement -