మాల్యా కోసం ఆ గదిని రెడీ చేశారట..!

206
Vijay Mallya

వ్యాపారవేత్త విజయ్ మాల్యా భారత్‌లోని పలు బ్యాంకులకు 9వేల కోట్ల రూపాయలు ఎగవేసి పరారీలో ఉన్న విషయం తెలిసింది. బ్రిటన్‌కు పారిపోయిన విజయ్ మాల్యాను స్వదేశానికి తీసుకువచ్చేందుకు మార్గం సుగమమైంది. ఈ కేసు విచారణ ప్రస్తుతం వేగవంతం కానుంది. ఈ నేపథ్యంలో మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు ఆమోదం తెలుపుతూ బ్రిటన్ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది.

Vijay Mallya

మాల్యాను లండన్ నుంచి తీసుకువచ్చిన వెంటనే..అతన్ని ఉంచేందుకు ఆర్దర్ రోడ్ జైలులో ఓ గదిని రెడీ కూడా చేసినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది. మాల్యాను భారత్‌కు అప్పగించే దస్త్ర్రంపై ఇటీవలే యూకే హోంమంత్రిత్వ శాఖ సంతకం  చేసింది. మాల్యాను భారత్‌కు అప్పగించాలని గతేడాది డిసెంబర్ 10న బ్రిటన్లోని వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.

మాల్యాను అప్పగింత ఒప్పంద ప్రక్రియలో భాగంగా చీఫ్ మెజిస్ట్రేట్ ఆదేశాలను హోం శాఖ మంత్రికి పంపారు. మాల్యా అప్పగింతపై ఉత్తర్వులు జారీ చేసే అధికారం ఆయనకు మాత్రమే ఉంది. రెండు నెలల్లోగా ఆయన దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా సోమవారం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై సంతకాలు చేశారు. ఈ నిర్ణయంపై బ్రిటన్లోని హైకోర్టులో అప్పీల్ చేస్తానని మాల్యా ట్విట్టర్లో వెల్లడించారు.