అన్ని వర్గాలను ఆదుకుంటాం: సీఎం కేసీఆర్

114
cm kcr
- Advertisement -

దళిత బంధుపై అవాకులు, చవాకులు పేలుతున్న వారి మాటలను నమ్మి మోసపోవద్దన్నారు సీఎం కేసీఆర్. టీఆర్ఎస్ ప్లీనరీలో అధ్యక్షోపన్యాసం చేసిన సీఎం…దళిత బంధుతో పాటు అన్నివర్గాల ప్రజలను ఆదుకుంటామని తెలిపారు. అట్టడుగు వర్గంలో ఉన్న దళితులను పైకి తీసుకొచ్చేందుకు ఈ పథకం తీసుకొచ్చామని చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెడుతున్న అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాలు.. ఇత‌ర రాష్ట్రాల ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షిస్తున్నాయి అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలిపారు. ద‌ళిత బంధు ప్ర‌క‌టించాక ఆంధ్ర నుంచి వేల విజ్ఞాప‌న‌లు వ‌చ్చాయని… ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మీ పార్టీ పెట్టండి గెలిపించుకుంటామ‌ని చెబుతున్నారు. తెలంగాణ ప‌థ‌కాలు త‌మ‌కు కావాల‌ని ఆంధ్రా ప్ర‌జ‌లు కోరుతున్నారన్నారు.

కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళిత బంధు లాంటి పథకాన్ని తీసుకురాగలరా అని ప్రశ్నించారు.ప్రజా పునాది ఉన్న పార్టీ టీఆర్ఎస్ అని,అతిత్వరలోనే టీఆర్ఎస్ కార్యాలయాల నిర్మాణాలు పూర్తవుతాయని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో టీఆర్ఎస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఢిల్లీలో కూడా పార్టీ కార్యాలయ నిర్మాణం త్వరలోనే పూర్తి కాబోతుందని తెలిపారు.

- Advertisement -