అన్ని వర్గాలకు టీఆర్ఎస్ న్యాయం చేస్తుంది- సీఎం కేసీఆర్‌

107
- Advertisement -

టీఆర్ఎస్ పార్టీ అధినేత‌, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న తెలంగాణ భ‌వ‌న్‌లో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర క‌మిటీ స‌మావేశం జరిగింది. ఈ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ స‌మావేశానికి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, సెక్రెటరీ జనరల్‌ కే కేశవరావు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, పార్టీ అనుబంధ సంఘాల బాధ్యులు, త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

ఈ మీటింగ్‌లో సీఎం కేసీఆర్‌ మాట్టాడుతూ.. దళిత బంధు పై ప్రజలను చైతన్యం చేయాలి. దళిత బంధును ఉద్యమం లాగా చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. దళిత బందుపై ప్రతిపక్షాల ఆరోపణలు తిప్పికొట్టాలని కేసీఆర్ ఆదేశించారు. రానున్న 20 ఏళ్లు కూడా మనమే అధికారంలో వుంటాం.. బిసి బంధుతో సహా అన్ని మనమే ఇస్తమన్నారు సీఎం. దశల వారీగా అన్ని వర్గాలకు బంధు ఇస్తమని స్పష్టం చేశారు. అన్ని వర్గాలకు టిఆర్ఎస్ న్యాయం చేస్తుంది. అన్ని వర్గాలకంటే దళితులు వెనుకపడ్డారు కాబట్టే మొదట వారికోసం దళిత బంధు తెచ్చామన్నారు.టివి ఛానల్ డిబేట్‌లలో ప్రతిపక్షాల తప్పుడు విమర్శల్ని తిప్పి కొట్టండి అని సీఎం సూచించారు.

ఇక నవంబర్ మొదటి వారంలో టిఆర్ఎస్ ప్లీనరీ జరుగుతుందన్నారు. ఈ నెలాఖరు వరకు మెంబర్ షిప్ పూర్తి చేయాలి. అలాగే సెప్టెంబర్ మొదటి వారంలో గ్రామ కమిటీలు, రెండోవారంలో మండల కమిటీలు, మూడో వారంలో జిల్లా కమిటీలు ఏర్పటు చేశాలి. అక్టోబర్‌లో రాష్ట్ర కమిటీలు పూర్తిచేసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. వచ్చే నెల 2న ఢిల్లీలో పార్టీ ఆఫీస్ శంకుస్థాపన చేయనున్నాట్లు సీఎం పేర్కొన్నారు.

- Advertisement -