మంత్రి ఐకే రెడ్డికి కృతజ్ఞ‌త‌లు తెలిపిన న్యాయ‌వాదులు..

74
minister indrakaran reddy

తెలంగాణ ప్రభుత్వం త్వర‌లో భర్తీ చేయనునున్న అసిస్టెంట్ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల (ఏపీపీ) పోస్టులకు ఇప్పుడున్న గరిష్ఠ వయోపరిమితిని 34 ఏండ్ల నుంచి 44 సంవత్సరాలకు పెంచినందుకు టీఆర్ఎస్ లీగ‌ల్ సెల్ హ‌ర్షం వ్య‌క్తం చేసింది. దీంతో నిరుద్యోగులకు ఎంతో లబ్ధి చేకూరునుందని చెప్పారు. ఏపీపీ అభ్య‌ర్థుల విజ్ఞ‌ప్తుల మేర‌కు స్పందించి వ‌యోప‌రిమితిని స‌డ‌లించినందుకు సీఎం కేసీఆర్‌కు ద‌న్య‌వాదాలు తెలిపారు.

ఈ నేప‌థ్యంలో టీఆర్ఎస్ లీగ‌ల్ సెల్ న్యాయ‌వాదులు అర‌ణ్య భ‌వ‌న్‌లో న్యాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి క‌లిసి కృతజ్ఞ‌త‌లు తెలిపారు. మంత్రిని క‌లిసిన వారిలో టీఆర్ఎస్ లీగ‌ల్ సెల్ ఇంచార్జీ సీ. క‌ళ్యాణ్ రావు, ఇత‌ర టీఆర్ఎస్ లీగ‌ల్ సెల్ ప్రతినిధులు లలితారెడ్డి, నల్లమోతు రాము, వేణుగోపాల రావు, అజయ్ కుమార్, పురెంధర్ రెడ్డి, రాము ప‌సుపుల, శ్రీనివాస్ నాయ‌క్, చంద్రశేఖర్ , జ‌య‌కృష్ణ, త‌దిత‌రులు ఉన్నారు.