బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ…

137
- Advertisement -

తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి జెండాను ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. అంతకుముందు స‌రిగ్గా మ‌ధ్యాహ్నం 1.20 గంట‌ల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ భార‌త రాష్ట్ర స‌మితి ప‌త్రాల‌పై సంత‌కం చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో జేడీఎస్ చీఫ్ కుమార స్వామి, సినీ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్, ఆయా రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నాయ‌కులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ బీఆర్‌ఎస్ కండువా ధరించారు. అంత‌కు ముందు ముందు భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన ప్ర‌త్యేక పూజ‌ల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వేద పండితుల ఆశీర్వ‌చ‌నాలు అందుకున్నారు కేసీఆర్.

టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మార్పు చెందడమే కాకుండా 60లక్షల మంది బీఆర్ఎస్ కార్యకర్తలను కలిగి ఉన్న ఏకైక పార్టీగా బీఆర్‌ఎస్ ఆవతరించింది. తెలంగాణను ఏవిధంగానైతే అభివృద్ధి చేసుకున్నామో అదే విధంగా దేశాన్ని బాగుచేసుకొనేందుకు నడుం బిగిద్దాం అని సీఎం కేసీఆర్‌ దసరా సందర్భంగా పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి…

బీఆర్‌ఎస్‌ ఆవిర్భావానికి కుమారస్వామి

పవన్ కళ్యాణ్ కు వారాహి చిక్కులు…

రెండోదశ మెట్రోకు శంకుస్థాపన

- Advertisement -