మహబూబ్‌నగర్‌లో ఘనంగా సీఎం కేసీఆర్ బర్త్ డే..

42
srinivas goud
- Advertisement -

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని KCR ఏకో అర్బన్ పార్క్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ ను కట్ చేసి 200 మంది ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్లు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలకు రూ.15 కోట్ల చెక్కులు పంపిణీ చేశారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. కులాంతర వివాహం చేసుకున్న లబ్దిదారులకు రూ.7.50 లక్షలు, రూ.6.50 లక్షలతో డెయిరీ యూనిట్ల ఏర్పాటు, కుట్టు మిషన్లు, కార్లు, ట్రాలీ ఆటోలు, ట్రాక్టర్లు, ఆటోలు, స్కూటీలు, ట్రై సైకిల్స్, వీల్ చైర్ లను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట రావు, అడిషనల్ కలెక్టర్ లు తేజస్ నందలాల్ పవర్, సీతారామ రావు, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేష్ మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదిన సంబరాల్లో భాగంగా, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఏనుగొండ లోని అనాధ వసతిగృహం లో స్కూల్ బ్యాగ్స్, దుప్పట్లు, పండ్లు మరియు కార్మికులకు హైజనిక్ కిట్స్ పంపిణి చేశౄరు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

- Advertisement -