తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్ , సిడ్నీ ,కాన్బెర్రా ,బ్రిస్బేన్ మరియు అడిలైడ్ పట్టణాలలో టీ.ఆర్.ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల ఆధ్వర్యంలో వేడుకలు భారీగా తరలివచ్చిన టీ.ఆర్.ఎస్ అభిమానులు కార్యకర్తల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిపారు. విక్టోరియా ఇంచార్జి సాయిరాం ఉప్పు ఆధ్వర్యంలో మెల్బోర్న్ లో ఉదయం శివ విష్ణు ఆలయంలో కేసిఆర్ గారి దీర్ఘ ఆయుష్షు కై పూజలు జరిపి, అన్న దాన కార్యక్రమాన్ని నిర్వహించారు .
సాయంత్రం పాయింట్ కుక్ లో జన్మ దిన వేడుకలు భారీ జన సమీకరణతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భాంగా టి ఆర్ ఎస్ ఆస్ట్రేలియా ప్రెసిడెంట్ నాగేందర్ రెడ్డి కాసర్ల గారు మాట్లాడుతూ, కేసీఆర్ మరియు ఆయన స్థాపించిన టి ఆర్ ఎస్ పార్టీ యొక్క గొప్పతనాన్ని, ఆస్ట్రేలియా నలుమూలాల మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పడానికి తమ టి ఆర్ ఎస్ ఆస్ట్రేలియా సభ్యులు విశేషంగా కృషి చేస్తున్నారనీ,తెలంగాణ పునర్నిమాణంలో తమ వంతు సహాయ సహకారాలను అందించడానికి సర్వదా సిద్ధమని, ఆ దిశలోనే పలు కార్యక్రమాలకు ఇప్పటికే శ్రీకారం చుట్టినామని తెలిపారు,బంగారు తెలంగాణను సాధించే దశలో కె సి ఆర్ గారు చేస్తున్న కృషిని కొనియాడారు. తెలనగానా ఉద్యమం లో కెసిఆర్ గారి పాత్ర , రాష్ట్రం వఛ్చిన తరువాత రాష్ట్ర అభివ్రిద్ది కి అహర్నిశలు తన శ్రమ ను కొనియాడుతూ బంగారు తెలంగాణ సాధనకై టీ.ఆర్.ఎస్ ఆస్ట్రేలియా తమ పూర్తి సహకారం అందిస్తుందని ప్రతిజ్ఞ చేశారు .
సాయిరాం ఉప్పు , రవి సాయల , విక్రమ్ కటికనేని, శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో విక్టోరియా, కాన్బెర్రా,సిడ్నీ మరియు బ్రిస్బేన్ లో వేడుకలునిర్వహించారు.మెల్బోర్న్ లో జరిగిన వేడుకలలో ప్రకాష్ సూరపనేని,సనీల్ బసిరెడ్డి ,ప్రవీణ్ లేదెల్ల ,కళ్యాణ్ ఐరెడ్డి, రమాకాంత్ , క్రాంతి , తెలంగాణ మధు ,రాంపాల్ ముత్యాల , పుల్ల రెడ్డి, ప్రవీణ్ దేశం , సతీష్ పాటి ,రమేష్ నందలి , మహేష్ రెడ్డి బద్దం , సంజీవ రెడ్డి రాయిరెడ్డి, వినోద్ గోపిడి మరియు ఇతర నాయకులూ పాల్గొన్నారు .
ఆస్ట్రేలియాలో కేసీఆర్ జన్మదిన వేడుకలు….
- Advertisement -
- Advertisement -