శారదాపీఠంపై సీఎం కేసీఆర్ కు ఎంతో గౌరవం ఉందిః స్వరూపానందేంద్ర స్వామి

308
SharadaPeetham
- Advertisement -

హైదరాబాద్ లోని జలవిహార్ లో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వాములకు సీఎం కేసీఆర్ పుష్పాభిషేకం మహోత్సవం నిర్వహించారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, వీ శ్రీనివాస్‌గౌడ్, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, ఎంపీలు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, శారదాపీఠం ట్రస్టు సీఈవో కామేశ్వరశర్మ, ట్రస్టు సభ్యులు సుబ్బారావు, మిరియాల రాఘవరావు పాల్గొన్నారు.

స్వరూపానందేంద్ర సరస్వతికి సీఎం కేసీఆర్ వేద నాదాలు, పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. జ్యోతి ప్రజల్వనచేశారు. స్వరూపానంద, స్వాత్మానందలకు సీఎం కేసీఆర్ పుష్పాభిషేకంచేశారు. తులసిమాల, నూతన వస్త్రాలు, ఫలాలను సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం శారదాపీఠానికి కేటాయించిన రెండెకరాల భూమికి సంబంధించిన పత్రాలను స్వరూపానందకు సీఎం కేసీఆర్ అందజేశారు.

స్వరూపానంద మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఏర్పాటుచేసిన కార్యక్రమానికి రావడం ఆనందంగా ఉన్నదన్నారు. హిమాలయాల నుంచి గంగాప్రవాహంలా పుట్టుకొచ్చిన పీఠం శారదాపీఠమని, ఆది శంకరులు ఏ ఐద్వెత తత్వాన్ని బోధించారో ఆ ఆద్వైత తత్వాన్ని ప్రచారం చేస్తున్న పీఠం తమదని తెలిపారు.

- Advertisement -