రైతు రుణమాఫీపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..

92
kcr cm
- Advertisement -

ఈరోజు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో రాష్ట్ర కేబినేట్‌ భేటీ కొనసాగుతున్నది. ఈ సందర్భంగా పలు అంశాలపై సీఎం కేబినెట్‌ సమావేశంలో చర్చిస్తున్నారు. రాష్ట్రంలో వర్షాలు, పంటలు, సాగునీటి లభ్యత, ఎరువులు, రుణమాఫీ, ఇతర వ్యవసాయ అంశాలతోపాటు పత్తిసాగుపైనా సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. తెలంగాణ పత్తికి ప్రత్యేక డిమాండ్‌ ఉన్న దృష్ట్యా సాగు విస్తీర్ణం పెంచాలని, ఇందుకోసం రాష్ట్ర రైతాంగాన్ని సమాయత్తం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

అలాగే రాష్ట్రంలో ఇప్పటివరకు పంట రుణమాఫీకి సంబంధించిన వివరాలను ఆర్థిక శాఖ కేబినెట్ ముందుంచింది. కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై భారం వల్ల, గత రెండు సంవత్సరాలుగా రూ. 25,000 (ఇరవై ఐదు వేలు) వరకు ఉన్న పంట రుణాలను మాత్రమే మాఫీ చేశాం. ఆగస్టు 15 నుంచి రూ.50,000 (యాభై వేలు) వరకున్న పంట రుణాల మాఫీని పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తద్వారా 6 లక్షల మంది రైతులు లబ్ధి చేకూరనుంది.

- Advertisement -