టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులుగా కేకే,సురేష్ రెడ్డి

569
kk
- Advertisement -

తెలంగాణలోని రెండు రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలకు టిఆర్ఎస్ అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. సీనియర్ నేతలు కే కేశవరావు, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిలను అభ్యర్థులుగా ప్రకటించారు.

పార్లమెంటరీ పార్టీ నేత, టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేకేకకు మరోసారి అవకాశం కల్పించగా నిజామాబాద్ జిల్లాకు చెందిన సురేష్ రెడ్డిని పెద్దల సభకు పంపారు సీఎం కేసీఆర్. టీఆర్ఎస్‌కు స్పష్టమైన మెజార్టీ ఉండటంతో రెండు స్ధానలను గెలుచుకోవడం లాంఛనమే. రేపు వీరు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.రాజ్యసభ సభ్యులుగా నియమించినందుకు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు కేకే,సురేష్ రెడ్డి.

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు సురేశ్ రెడ్డి. వైఎస్ హయాంలో స్పీకర్‌గా పనిచేశారు. 1984లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన సురేశ్ రెడ్డి…1989, 1994, 1999, 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

- Advertisement -