సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి: మంత్రి హరీష్ రావు

225
harish rao
- Advertisement -

సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అని కొనియాడారు మంత్రి హరీష్ రావు. బడ్జెట్‌పై జరిగిన చర్చకు సమాధానం ఇచ్చిన హరీష్..కాంగ్రెస్ నాయకులకు ఉన్న భ్రమలకు ఈ బడ్జెట్ బద్దలు కొట్టిందన్నారు. ప్రజలు టీఆర్ఎస్,సీఎం కేసీఆర్ నాయకత్వంపై విశ్వాసంతో ఉన్నారని అందుకే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పారన్నారు.

సంక్షేమ రంగానికే అత్యధిక నిధులు కేటాయించామని …బడ్జెట్‌పై ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. మాంద్యం ఉన్నా సంక్షేమానికి రూపాయి కూడా తగ్గించొద్దని సీఎం కేసీఆర్‌ చెప్పారని…అందుకే మానవీయ కోణంలో బడ్జెట్‌ను రూపొందించామని స్పష్టం చేశారు హరీష్‌.

హైదరాబాద్‌ అభివృద్ధికి కేంద్రం నిధులు ఇవ్వడం లేదని… కానీ హైదరాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు ఈ ఏడాదికి బడ్జెట్‌లో రూ. 10 వేల కోట్లు కేటాయించామన్నారు. తెలంగాణ సాధించిన ప్రగతిని దేశంలోని వివిధ రాష్ట్రాలు స్పూర్తిగా తీసుకున్నాయని చెప్పారు.

బడ్జెట్‌పై చర్చ సందర్భంగా భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు ఒక్క కొత్త విషయం కూడా చెప్పలేదు. సంక్షేమ రంగానికి నిధులు ఎక్కువ కేటాయించినందుకు వారు సంతోష పడలేదన్నారు. పెట్టుబడి వ్యయంలో తెలంగాణ దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో ఉందన్నారు.

- Advertisement -