తెలంగాణ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మకమైన పథకంను ప్రవేశపెట్టనున్నారు సీఎం కేసీఆర్. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. గీత కార్మికుల బీమాను అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కల్లు గీసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారని…ఈ క్రమంలో మృతుడి కుటుంబానికి రూ.5లక్షల బీమా సాయాన్ని నేరుగా ఖాతాలో జమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ మేరకు విధి విధానాలను రూపాందించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావును సీఎం ఆదేశించారు.
Also Read: మోడీ.. కర్నాటక పీఎం ?
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… ప్రమాదవశాత్తు జారిపడి ప్రాణాలు కోల్పోతున్న కల్లుగీత కార్మికుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు. ఇప్పటికే ఎక్స్ గ్రేషియా అందిస్తున్నా బాధితులకు అందడంలో ఆలస్యమవుతున్నదన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతన్నల కుటుంబాల కోసం అమలు చేస్తున్న రైతుబీమా తరహాలోనే, కల్లుగీతను వృత్తిగా కొనసాగిస్తున్న గౌడన్నల కుటుంబాలకు వారం రోజుల్లోనే బీమా నగదు అందేలా ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం అన్నారు.
Also Read: మంత్రి పువ్వాడతో జూ.ఎన్టీఆర్ భేటీ..!