ప్రతీ ఎకరా సాగులోకి: సీఎం కేసీఆర్

200
cm kcr

రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిందని….గ్రామాల్లో ఒక్క ఎక‌రం కూడా వదలకుండా, వ్యవసాయానికి అనువుగా ఉన్న భూములను రైతులు సాగు చేస్తున్నార‌ని తెలిపారు సీఎం కేసీఆర్. రెండో రోజు ప్రగతి భవన్‌లో జరిగిన కేబినెట్ సమావేశంలో మాట్లాడిన సీఎం…గ‌త ఏడేండ్ల కాలంలో వ్య‌వ‌సాయ రంగంలో తెలంగాణ సాధించిన‌ ఘ‌న విజ‌యాల‌ను మంత్రులకు వివరించారు.

24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందించడంతో పాటు, అనేక కష్టాలకోర్చి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో నదీజలాలను చెరువులకు, కుంటలకు, బీడు భూములకు ప్రభుత్వం మల్లించిందని సీఎం తెలిపారు. వానాకాలం సాగు ప్రారంభమైన నేపథ్యంలో, విత్తనాలు ఎరువుల లభ్యత, వర్షాపాతం తదితర అంశాల పై కేబినెట్ చర్చించింది.