జగిత్యాలలో కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ ఆరా

120
kcr
- Advertisement -

జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం రేగుంట గ్రామంలోని చేన్నూరు శాసన సభ్యులు, విప్ శ్రీ బాల్కసుమన్ గారి ఇంటికి హైదరాబాద్ నుండి రోడ్డు మార్గంద్వారా చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకంట్ల చంద్రశేఖర్ రావు. ఇటీవల స్వర్గస్తులైన బాల్క సుమన్ గారి తండ్రి స్వర్గీయ బాల్క సురేష్ గారి చిత్ర పటానికి పూలుచల్లి నివాలులు అర్పించి, ఆయన కుటుంబసభ్యులను పరామర్షించిన రాష్ట్ర ముఖ్యమంత్రి.

అనంతరం జిల్లాలో కరోనా పరీస్థితులను గురించి జిల్లా కలెక్టర్ జి. రవి గారిని అడుగగా, జిల్లాలో లాక్ డౌన్ వలన కేసులు చాలా తగ్గుముఖం పట్టాయని, లాక్ డౌన్ పటిష్టంగా అమలు చెస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. కార్యక్రమ ఏర్పాట్లను కమీషనర్ ఆఫ్ పోలీస్ వి. కమలాసన్ రెడ్డి, ఐజి వై. నాగిరెడ్డి, జగిత్యాల కలెక్టర్ జి. రవి, ఎస్పి శ్రీమతి సిందుశర్మ, ఇంటలిజన్స్ ఎస్పి రాజమహేంద్ర నాయక్ పరీశీలించారు.

 ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమశాఖ మాత్యులు కోప్పుల ఈశ్వర్, పెద్దపెల్లి ఎంపి వెంకటెషన్ నేతకాని, జగిత్యాల ఎమ్మెల్యే డా. యం. సంజయ్ కుమార్, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద్రశేఖర్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి, పెద్దపెల్లి ఎమ్మేల్యే దాసరి మనోహర్ రెడ్డి, రాజ్యసభ్య సభ్యులు సంతోష్ కుమార్, సురేష్ రెడ్డి,  జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి దావ వసంత, పలువురు నాయకులు పాల్గోన్నారు.
- Advertisement -