తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్ పై నివేదిక

36
puvvada

రాష్ట్రంలోని ప్రజలకు ఉచిత రోగనిర్ధారణ సేవలను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది దీనికి గాను 2018 లో, “తెలంగాణ డయాగ్నోస్టిక్స్”, ఇన్-హౌస్ హబ్ & స్పోక్ మోడల్ ఆఫ్ డయాగ్నోస్టిక్స్ హైదరాబాద్‌లో ప్రారంభించబడింది.రక్త నమూనాలను 342 పిహెచ్‌సిలు, బస్టిదావాఖానాలు & సిహెచ్‌సిల నుండి సేకరించి సెంట్రల్ హబ్‌కు రవాణా చేస్తారు, ఇక్కడ నమూనాలను విశ్లేషించడం అత్యాధునిక పరికరాల ద్వారా జరుగుతుంది మరియు ఆన్‌లైన్ నివేదికలు రోగులకు ఎస్ఎంఎస్ ద్వారా పంపబడతాయి. రోజుకు 25 వేల పరీక్షలు జరుగుతాయి.

ఇదే విధంగా 19 జిల్లాల్లో డయాగ్నొస్టిక్ సేవల హబ్ & స్పోక్ మోడల్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఖమ్మం జిల్లా లో జనవరి 07 2021 వ తేదీన డ్రై రన్ ప్రారంభమైంది ప్రతి రోజు గంటకి 1800 నమూనాలను పరీక్షించే సామర్ధ్యం వున్న 24 గంటలు పనిచేసి పరికరాలు అందుబాటులో న్నాయి.
ఈ సందర్బంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు పలువురితో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటి డయాగ్నసిస్ సెంటర్ ని ప్రారంభించారు .

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ హబ్ & డయాగ్నొస్టిక్ మోడల్ యొక్క ప్రధాన లక్ష్యాలు తెలంగాణ రాష్ట్రం లో ప్రతి పౌరుడికి వుచితముగా వ్యాది నిర్ధారణ పరీక్షలను అందించడం ఈ తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్ యొక్క ప్రధాన లక్ష్యం. సామాన్యులు తమ సంపాదనలో 90% (out of pocket expenditure) మందులు మరియు పరీక్షలపై ఖర్చు చేస్తున్నారు కావున గ్రామీణ ప్రాంత ప్రజలకు రవాణా ఖర్చు మరియు వ్యాది నిర్ధారణ పరీక్షల కొరకు ఖర్చు లేకుండా అత్యాదునిక పరికరాలతో పరీక్షలు నిర్వహించడము జరుగుతుంది. సరిఅయిన నిర్ధారణ పరీక్షల ద్వారా సకాలములో వ్యాధి నిర్ధారణ చేసి చికిత్స అంధిచడం దీని యొక్క ప్రధాన లక్ష్యం.