కల్తీ విత్తనాలపై అప్రమత్తం కండి:సీఎం కేసీఆర్

153
kcr cm
- Advertisement -

కల్తీ విత్తనాల తయారీ మీద జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తం కావాలన్నారు. వొకవేల వ్యవసాయ శాఖ అధికారులే స్వయంగా ఎక్కడైనా అవినీతికి పాల్పడుతూ కల్తీ విత్తన ముఠాలతో జట్టుకట్టినట్టు రుజవైతే వారిని ఆక్షణమే ఉద్యోగం లోంచి తొలగించడమే కాకుండా 5 సంవత్సరాలు జైలు శిక్ష పడేలా చూడాలన్నారు.
:
వ్యవసాయ శాఖ అధికారులు అలసత్వం వీడాలె. ప్రేక్షక పాత్ర వహించకుండా కల్తీలను పసిగట్టి నియంత్రించాలె.దీనికి జిల్లా వ్యవసాయధికారి అసిస్టెంట్ డైరక్టర్లు బాధ్యత వహించాలె. వారి వారి జిల్లాల్లో పర్యటించాలె. కల్తీకి అలువాటు పడిన ముఠాలను గుర్తించి పీడీ యాక్టు బుక్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలె. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్లు జిల్లా ఎస్సీలు కమిషనర్లు సమీక్షలు నిర్వహించాలె. అని అన్నారు.కల్తీ విత్తనాల నియంత్రణకు దేశంలో మెట్టమొదటి సారిగా తెలంగాణ రాష్ట్రంలో క్యూ ఆర్ కోడ్ తో సీడ్ ట్రేసబిలిటీని అమలు చేయాల్సిందిగా సిఎం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని ఆదేశించారు.

ప్రభుత్వం ఆమోదించిన విత్తన కంపెనీలే విత్తన విక్రయాలు చేపట్టేలా ఈ నియంత్రణ చర్యలుండాలని తెలిపారు. క్యూఆర్ కోడ్ తో కూడిన ప్రభుత్వ సర్టిఫైడ్ ముద్రిత విత్తనాల ప్యాకెట్ల మీద వుంటున్నందున, స్మార్ట్ ఫోన్ తో స్కాన్ చేయడం ద్వారా విత్తన కంపెనీల పూర్తి వివరాలుంటాయని మంత్రి సిఎం కెసిఆర్ కు వివరించారు. ఆలస్యం చేయకుండా తక్షణమే ఈ విధానాన్ని అమలులోకి తేవాలని సిఎం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని ఆదేశించారు.
విత్తనాల లభ్యత :
ఇప్పటికే రోహిణీ కార్తె జొరబడినందున మరో వారం రోజుల్లో రుతుపవనాలు కూడా వస్తున్నందున, రైతులు వ్యవసాయానికి సిద్దమైతున్ననేపథ్యంలో రైతులకు విత్తనాలను ఎరువులను అందుబాటులో ఉంచాలని ఆమేరకు తక్షణమే ఏర్పాట్లు చేసుకోవాలని సిఎం అధికారులకు సూచించారు. పత్తి కంది వరిధాన్యం విత్తనాలను కావాల్సినంత మేరకు సేకరించి రైతలకు అందించాలన్నారు.అదే సమయంలో కావాల్సినంత ఎరువులను ఫెస్టిసైడ్లను సిద్దం చేసుకోవాలని తెలిపారు.
ఇద్దరు అడిషనల్ డైరక్టర్లను నియమించుకోండి :
వ్యవసాయ శాఖ రోజు రోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారులను నియమించుకోవాలని సిఎం మంత్రికి ఆదేశించారు. విత్తన, ఎరువులు ఫెర్టిలైజర్ల వ్యవహారాలు చూసేందుకు కోసం వొకరిని, మార్కెటింగ్ అనాలసిస్ రిసెర్చ్ వింగ్ కోసం మరో అడిషనల్ డైరక్టర్ ను నియమించుకోవాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్దం చేయాలని సిఎస్ కు సిఎం ఆదేశించారు.

వెదజల్లే పద్దతిని ప్రోత్సహించాలె
వ్యవసాయ శాఖ అధికారులకు సిఎం ఆదేశం :
వరి నాటులో వెదజల్లే పద్ధతి ద్వారా వరి పంట సాగు చేస్తే.. రెండు పంటలకు కలిపి కోటి ఎకరాలు సాగు చేసే తెలంగాణ రైతులకు సుమారు రూ.10 వేల కోట్లపైనే పెట్టుబడి మిగులుతుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తెలిపారు. ఈ పద్ధతిలో వరి పంట సాగు చేస్తే ఎకరానికి 2-3 బస్తాలు (1-2 క్వింటాళ్లు) దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉందని సీఎం పేర్కొన్నారు. వ్యవసాయ శాఖపై శనివారం ప్రగతి భవన్ లో జరిపిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో వరి నాటులో ధాన్యం వెదజల్లే పద్ధతి గురించి సీఎం ప్రత్యేకంగా చర్చించారు. ఈ పద్దతిలో వరి సాగు చేసే అంశంపై తెలంగాణ రైతుల్లో విస్తృత అవగాహన కల్పించాలని వ్యవసాయశాఖ అధికారులను సీఎం ఆదేశిచారు. ఈ వరి ధాన్యం విత్తనాలను వెదజల్లే పద్ధతి ద్వారా బురదలో కాలు పెట్టకుండానే వరి పంట నాటుకోవచ్చని అన్నారు .

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ … ” నారు పోసే పని లేదు . నారు పీకే పని లేదు. నాటు పెట్టే పని లేదు. కూలీల కోసం గొడవ లేదు. కలుపు కూలీల ఇబ్బంది లేదు. నీటి వినియోగం 30- 35 శాతం తగ్గుతుంది. 10-15 రోజుల ముందు క్రాప్ వస్తుంది. మామూలు పద్ధతిలో అయితే ఎకరానికి 25 కిలోల విత్తనాలు కావాలి. ఈ వెదజల్లే పద్ధతి అయితే 8 కిలోల విత్తనపొడ్లు సరిపోతయి. వడ్లు సల్లినంక ఎన్ని రోజులకైనా నీళ్లు కట్టుకోవచ్చు. విత్తనపొడ్లు వెదజల్లినంక వర్షం పడే దాక కొన్నిరోజులు ఎదురు చూస్తే ఇంకా మంచిది. కాళేశ్వరం సహా అన్ని సాగు నీటి ప్రాజెక్టులు , లిఫ్టులు , సుమారు 30 లక్షల బోరుబావుల పరిధిలో వరి సాగు చేసే రైతులకు ఈ వరి నాటులో వెదజల్లే పద్ధతి చాలా ఉపయోగపడుతుంది. ఖమ్మం జిల్లాలో ఈ వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేసే రైతులను పిలిచి ఈ విధానం గురించి స్టడీ చేశాను . నేను స్వయంగా రైతును కాబట్టి నా పొలంలో ఈ విధానంలో వరి సాగు చేసి మంచి ఫలితాలను పొందాను. ఈ పద్ధతిలో విత్తనపొడ్లు సల్లడానికి యంత్ర పరికరాలు కూడా అందుబాటులో ఉన్నయి. తెలంగాణలో వరి సాగు చేసే రైతులందరూ ఈ వెదజల్లే పద్దతిని అనుసరిస్తే మంచిది” అని సీఎం వివరించారు.

- Advertisement -