రాష్ట్రంలో లాక్‌డౌన్ పొడగింపు వద్దు: ఓవైసీ

44
owaisi

రాష్ట్రంలో లాక్ డౌన్ నేటితో ముగియనుండగా ఇవాళ జరిగే కేబినెట్‌లో ఏం నిర్ణయం తీసుకుంటారా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారుజ

కరోనాను ఎదుర్కోవడానికి లాక్ డౌన్ ఒక్కటే మార్గం కాదని…. లాక్ డౌన్‌తో అనేక మంది పేదలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. లాక్ డౌన్ విధించకుండా కరోనాపై పోరాడ వచ్చన్నారు. కరోనాపై పై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించాలన్నారు. మాస్క్ వాడకం, సామాజిక దూరం పాటించడంపై, మహమ్మారి దీర్ఘాకాలిక వాస్తవికతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. యూనివర్శిల్ వ్యాక్సిన్ మాత్రమే దీనికి దీర్ఘకాలిక పరిష్కారమన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో కేసులు తగ్గడం వల్ల లాక్ డౌన్ విధించాల్సిన పనిలేదన్నారు.